పూజా - జప నియమాలు!


పూజా - జప నియమాలు!

పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి..

[ బ్రహ్మకపాల చరిత్ర! = https://youtu.be/kBQMLBnXlos ]

నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి..

ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి..

ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు..

గంటను పువ్వుతో అర్చించి, తరువాత మ్రోగించాలి. అయితే, గంటనూ, శంఖాన్నీ, తమలపాకునూ, ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు..

పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు..

పూజలో వీలైనంతవరకూ ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది..

తూర్పు-ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది..

ఒంటి చేయి చాచి, తీర్థాన్ని స్వీకరించరాదు. చేతి క్రింద వస్త్రాన్నుంచుకుని, శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో, చేతి క్రింద చేతినుంచాలి. సాధ్యమైనంతవరకూ, నిలబడి తీర్థ ప్రసాదాలను స్వీకరించ రాదు. తీర్థం స్వీకరించేటప్పుడు, చప్పుడు కాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని తలపై రాసుకోరాదు..

పూజలకూ, జపానికీ వినియోగించే ఆసనం, అనుష్ఠాన అనంతరం, ఎవరికి వారే తీయాలి. ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే, వారి జప ఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు..

జపం చేసేటప్పుడు, మాల మధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి..

నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఆ వస్త్రాలకు నలువైపులా, కొసలకు పసుపుపెట్టి ఇవ్వాలి..

అన్న నివేదన చేసేటప్పుడు, శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి, అన్న పాత్రను ఉంచాలి..

వట్టి నేలపై కూర్చుని జపించరాదు, పూజించరాదు, భుజించరాదు..

’పూజ’ అంటే 'భోగములను ప్రసాదించునది' అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి, దేవతా శక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు..

మనం పలికే స్తోత్ర శబ్దాలూ, దీప - ధూపాలూ, కుసుమాలూ, దేవతలకు ప్రీతికరాలు. శుచి ప్రియులు దేవతలు. అందుకే, పూజా జప ప్రాంతాలలో శుచీ శుభ్రతా ఉండాలి..

బహిష్ఠు స్త్రీలు మసలే చోటా, వారి దృష్టిపడే చోటా, దేవతా పూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మ జగత్తులో, ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి..

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgxBX2HXV0as01r9N314AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes