మహాసిద్ది!
ఏడాది నిండిన తన బిడ్డకు పుట్టినరోజు వేడుక చేస్తుంది తల్లి..
ఆ బిడ్డకు ఏవేవో అలంకరించి మురిసిపోతుంది..
ఇవేవీ ఆ బిడ్డకు తెలియదు.. ఆ బిడ్డకు కావలసినది తల్లి ఒడి ఒక్కటే..
అలాగే, మన జీవితంలో మనకు లభించేటివన్నీ, భగవంతుడు మనకు అలంకరించుకుని చూసుకునే ముచ్చటే..
ఏమైనా రానీ, ఏమైనాగానీ భగవంతుని శిశువుగా మనముందాం..
శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్ఝటి కవి, మంచి శరణాగతి పద్యం చెప్పారు..
'నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసారమోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుదింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా!'
పరమేశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా..
నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ..
నన్ను సామాన్యుడననీ, గొప్పవాడననీ..
సంసారవ్యామోహము కలుగనీ, జ్ఞానము కలుగనీ..
గ్రహచారము నన్ను క్రుంగదీయనీ, లేక మంచి చేయనీ..
అవన్నీ నాకు ఆభరణాల వంటివే అవుతాయి శ్రీకాళహస్తీశ్వరా..
నీ పాదసేవ చేస్తున్న నాకు, అన్నీ నీ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి.. అన్నిటికీ సిద్ధపడి ఉండడమే 'మహాసిద్ధి'..
Manchimata Videos:
[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]
[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]
[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]
[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]
[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]
[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]
[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]
[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]
[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]
[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]
[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]
[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]
[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]
Link: https://www.youtube.com/post/Ugx3gl7sTG-3kOUGTVZ4AaABCQ
Post a Comment