శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు, ముక్కోటి దేవతలూ వైకుంఠానికి తరలి వెళ్లే సందర్భం, వైకుంఠ ఏకాదశి. భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున, ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి, పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.
[ ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/Lcy2ZkxYfYY ]
వైకుంఠ ఏకాదశి రోజున, సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం, పూజ గదిని శుభ్రపరచుకుని, తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి, విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతి పాత్రమైన తులసీ దళాలతో, ఆ స్వామిని పూజించుకోవాలి.
ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధు కైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో, తమలాగానే వైకుంఠ ద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా, హరిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని, వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి, ఇహ లోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ, ఆ భగవంతుని వేడుకోవడం, ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.
ఏడాది పొడవునా, ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే, అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలూ, ఐదు జ్ఞానేంద్రియాలూ, మనస్సూ, ఇలా మొత్తం కలిపి, ఏకాదశ ఇంద్రియాలుంటాయి.
ఈ ఏకాదశ ఇంద్రియాలను ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే, ఏకాదశి వ్రతం. ఇందుకోసం, ముందు రోజు రాత్రి నుంచే, ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున, కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం, ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.
ఏకాదశి రోజు రాత్రి, భగవన్నామ స్మరణతో, జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనస్సునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని, వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే, ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే, లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా, కేవలం హరి నామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు. ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి, ఇహ పర శాంతి లభిస్తుంది.
హరినామ స్మరణం, సర్వ పాప హరణం.. జై శ్రీమన్నారాయణ!
Manchimata Videos:
[ స్నేహ బంధం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/v5BseWhhnPM ]
[ అమృత హస్తం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]
[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]
[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]
[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]
[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]
[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]
[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]
[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]
[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]
[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]
[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]
[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]
[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]
[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]
Post a Comment