ధనుర్మాసం - Dhanurmasam

 

ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత?

రాబోయేకాలం ధనుర్మాసమే.. 'ధనుర్మాసం' ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. 

చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు. ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. కాగా, ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. 

మనవులకు ఒకసంవత్సరం, దేవతలకు ఒకరోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట, కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం. అనగా, ఇది రాత్రి కాలం. మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం. ఇక్కడి నుండి ఉత్తరాయణం. అనగా, పగలుగా భావన. ఇలా భావిచినప్పుడు, దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది, ఐనదే ధనుర్మాసం.

పరాతః కాలము వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది, కనుక, సత్వగుణ ప్రధానమైన విష్ణువును ,ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి  ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే.

సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు.

ఈ నెల రోజులూ, ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ, నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే, ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ, మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా, ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.

కర్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది.

ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల, మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.

ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.

ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది.

ధనుర్మాసఫలశ్రుతి:

ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయినా మనసా వాచ కర్మణా యదాశక్తిగా పూజించిన యెడల, 1000 యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే, ఏదైనా ఒక నదిలో కానీ, లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ పుణ్య జలంలో కానీ, లేదా ఒక చెరువు లో కానీ, మీకు తోచిన పుణ్య స్థలంలో, ఒక్క మునుగు మునుగిన, 4 రెట్లు అశ్వమేధ యాగం చేసిన ఫలితము దక్కును.

లకాసమస్తా శుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgzVU4ZSsS3J2OcpFLB4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes