ప్రార్థన ఎలా ఉండాలి!

 

ప్రార్థన ఎలా ఉండాలి!

ఓం సర్వేజనాః సుఖినోభవంతు - సర్వజనులు సుఖపడుదురు గాక. 

లోకాః సమస్తాః సుఖినోభవంతు - సర్వలోకములు సుఖమయమగు గాక. 

తత్త్వ దిగ్విజయ ప్రాప్తిరస్తు - తత్వ జ్ఞానము విశ్వవ్యాప్తమగు గాక.

శాంతి రేవ శాంతి రస్తు - శాంతి సర్వత్రా ఉండు గాక.

సమస్త సన్మంగళాని భవంతు - సమస్తమూ మంగళప్రదమగు గాక.

ఓం హరిః ఓం స్వస్తి - స్వస్తికి ఫలము నిచ్చు హరికి నమస్కారము..

'ప్ర + ఆర్థన = ప్రార్థన' అంటే, చక్కగా వేడుకోవడం. ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ 'బొమ్మా బొరుసూ' లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం, సహజం. ధనం ధర్మంగా సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవచ్చు.

అంతులేని కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ధనం ఇంధనంలా దహించుకుపోతూంటుంది. జీవితంలో ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు తప్పనిసరిగా అర్థం అవుతుంది. అప్పుడు.. ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న జ్ఞానం కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస, ఆ సమయంలో మొదలవుతుంది. గుండెలోతుల్లోనుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై, ఒక ఆవేదనా రూపమై చెలరేగుతుంది. అదే 'ప్రార్థన!'.

దూడను ప్రసవించగానే, గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు, భగవంతుడు భక్తులను లాలించి, పాలిస్తాడు. పరమ ప్రేమస్వరూపుడైన భగవంతుడికి, తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు. సాత్వికులైన ధ్రువుడూ, ప్రహ్లాదుడూ, శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి, భగవంతుడి పాదసేవనం అనే పరమానందాన్ని కోరుకున్నారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడూ, రావణుడూ, అధికారం, ఆధిపత్యం కోరుకున్నారు! తమ వినాశనాన్ని వారే కోరి, కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని, విశ్వశ్రేయస్సే మనకూ శ్రేయోదాయకమనీ, బుద్ధిగా జీవించాలనీ, త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే, 'ప్రార్థన!'. అదే మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానము.

భగవంతుణ్ని సేవించే భక్తులను, నాలుగు తెగలుగా చెబుతారు.. ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఈ నలుగురిలో, ఆయనకు చాలా దగ్గరివాడు 'జ్ఞాని' అని, గీతాచార్యుడు సెలవిచ్చాడు. భగవంతుడు మనిషికి అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉంటుంది. అందుకు కారణం, ఏదో ఒకమూల స్వార్థ పిశాచం పట్టి పీడిస్తూ ఉండడం వల్లే, అలా మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో, శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు. తక్కినదంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే వ్యక్తపరిచారు. అయినా, 'అజ్ఞానం, అహంకారం, మమకారం' అనే మూడూ ఏకమై, మనల్ని పెడదారి పట్టిస్తూ ఉంటాయి. అలా జరగకుండా, మనస్సును నిర్మలంగా ఉంచమనీ, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమనీ, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమనీ, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే, నిజమైన 'ప్రార్థన!'. ఆ ప్రార్థన సన్నని వెలుగై, మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినోభవంతు, లోకాః సమస్తాః సుఖినోభవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను, వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారి దీపమై వెలుగు చూపాలని అర్థించాలి. 'అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి' అనే భావనతో జీవనం కొనసాగించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!

ఈ క్రింది వీడియోలు చూసి మీ అభిప్రాయం comment చేయండి:

[ స్నేహ బంధం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/v5BseWhhnPM ]

[ అమృత హస్తం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]

[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]

[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]

[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]

[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]

[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]

[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]

[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]

Link: https://www.youtube.com/post/UgzpO_BoE2SNUzaeI7J4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes