20 లక్షల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మొదటి గ్రంధం! Surya Siddhanta

 


20 లక్షల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మొదటి గ్రంధం! సూర్య సిద్ధాంతం! 

భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఎవరు, ఎప్పుడు కనిపెట్టారు? అనడిగితే, మనలో చాలామంది టక్కున చెప్పే సమాధానం, Sir Isaac Newton, 17 వ శతాబ్దంలో కనుగొన్నాడు, అని చెబుతారు. అయితే, మీ సమాధానం తప్పు, అని ఒక గ్రంథం చెబుతుంది. ఎందుకంటే, ప్రపంచ మానవ చరిత్రలో ఉద్భవించిన తొలి ఖగోళ శాస్త్రపు గ్రంథం అది. అత్యంత పురాతన చరిత్రతో పాటు, జ్ఞాన సంపదకు పుట్టినిల్లైన మన భారతదేశపు మహా పురుషులు వ్రాసిన గ్రంథం అది. దాని వయస్సు నేటి మానవుడి ఊహకు కూడా అందదు. ఒకటి కాదూ, రెండు కాదూ, ఏకంగా 20 లక్షల సంవత్సరాల క్రితం లిఖించబడ్డ మహోన్నత ఖగోళ శాస్త్ర గ్రంథం అది. అసలు ఆ గ్రంథం పేరేమిటి? దాన్ని ఎవరు రాశారు? అందులో మన భూమి, మరియు ఇతర గ్రహాల గురించి ఉన్న విషయాలేంటి? అందులో చెప్పబడినది సరైనదేనా, కాదా? అనే విషయాలు, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/40259dhpZm4 ]

ప్రపంచ ఖగోళ పరిశోధన ఫలితంగా వెలువడిన తొలి ఖగోళ శాస్త్ర గ్రంథం, సూర్య సిద్ధాంతం. దీనిని తొలిసారిగా, కొంత భాగం, 20 లక్షల సంవత్సరాల క్రితం వ్రాసినట్లు మన పురాణాలను బట్టి తెలుస్తున్నా, దీన్ని పూర్తి ఖగోళ శాస్త్ర గ్రంథంగా అభివృద్ధి చేసింది మాత్రం, త్రేతాయుగంలో అని తెలుస్తోంది. ఆ యుగంలో అసురాధినేత రావణ బ్రహ్మకు స్వయంగా మామగారైన మయాసురుడు, సూర్య సిద్ధాంతాన్ని పూర్తిగా లిఖించాడు. ఆయన తరువాత, 2500 సంవత్సరాల క్రితం, క్షీణ దశలో ఉన్న ఈ గ్రంథాన్ని, పున: లిఖించారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న గ్రంథం, 2,500 సంవత్సరాల క్రితం లిఖించినదే. ఈ గ్రంథంలో అప్పటి మన మహా పురుషుల గణాంకాలను ఆధారంగా తీసుకుని, భూమ్యాకర్షణ శక్తి గురించీ, మనకు పట్టే ఒక సంవత్సర కాలంలో ఉన్న రోజుల గురించీ, భూ భ్రమణం చుట్టు కొలతలతో పాటు, మన విశ్వంలో ఉన్న ఇతర గ్రహాలూ, వాటి యొక్క కొలతల గురించీ, పూర్తిగా వివరించబడింది. పాశ్చాత్యులకు భూమి ఏ ఆకారంలో ఉంటుందో తెలియని ఆ కాలంలోనే, ఈ గ్రంథంలో భూమి గుండ్రంగా ఉంటుందని తెలియజేయడంతో పాటు, మన భూమి గురించి నేడు చెప్పబడిన విషయాలన్నీ, అందులో పొందుపరిచబడి ఉన్నాయి. 

పెద్ద పెద్ద టెలిస్కోపులు గానీ, ఆధునిక టెక్నాలజీ గానీ లేని ఆ రోజుల్లో, ఇంతటి విజ్ఞానాన్ని నాటి మన పూర్వీకులు ఎలా సంపాదించారు? అనే విషయం, ఇప్పటికీ ఒక మిస్టరీ అయితే, అందులో చెప్పబడిన విషయాలు, నేటి పరిశోధనలతో పోల్చి చూస్తే, ఆశ్చర్యపోకతప్పదు. Isaac Newton కనిపెట్టిన Gravitational Theory ని, అన్ని వేల సంవత్సరాల క్రితమే, భూమ్యకర్షణ అని ఈ గ్రంథంలో వివరించబడి ఉంది. ఒక ధారణాత్మక శక్తి కారణంగా భూమి, ఆకాశంలో ఒకే కక్ష్యలో ఉండి, తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా చెప్పబడింది. అంతేకాదు, సూర్య సిద్ధాంతం ప్రకారం, ఒక సంవత్సరానికి 365.2435374 రోజులుంటే, మన ఆధునిక సైన్స్ ప్రకారం, 365.2421879 రోజులు. ఈ రెండు సిద్ధాంతాలకూ మధ్య గల తేడా, కేవలం ఒక నిముషం 54.44128 సెకన్లు మాత్రమే. ఇక గ్రహాల చుట్టుకొలతల గురించి చెప్పుకుంటే, సూర్య సిద్ధాంతం ప్రకారం, బుధుడు, అంటే, Mercury చుట్టుకొలత, 3,008 మైళ్లుంటే, ఆధునిక కొలతల ప్రకారం 3,032 మైళ్లుంది. శని గ్రహం, అంటే, Saturn చుట్టుకొలత, ఈ గ్రంథం ప్రకారం, 73,882 మైళ్లుంటే, ఆధునిక శాస్త్రం ప్రకారం 74,580 మైళ్లుగా చెప్పబడింది. ఇక అంగారకుడు, అంటే, Mars చుట్టుకొలత 3,772 మైళ్లుగా సూర్య సిద్ధాంతం చెబుతుంటే, నేటి లెక్కల ప్రకారం, 4,218 మైళ్లున్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా సూర్య సిద్ధాంతంలో ప్రతీ గ్రహానికీ ఇచ్చిన చుట్టుకొలతలు, నేటి మన ఆధునిక ఖగోళ శాస్త్రానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎటువంటి ఆధునిక పరికరాలు, Satellites, Telescopes లేని ఎన్నో యుగాలకు పూర్వం, ఈ లెక్కలన్నీ మన వారు ఎలా కనిపెట్టారు? అని అడిగితే, మన ఊహాశక్తికి అందనంత విజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం వారి సొంతమని చెప్పాలి. ఈ సూర్య సిద్ధాంతంలో సమస్త ఖగోళ రహస్యాల గురించి, ఈ విధమైన అధ్యాయాలుగా పేర్కోనబడ్డాయి. అవి, గ్రహాల కదలికలూ, గ్రహాల ఉచ్ఛ స్థితీ, దిశా, ప్రదేశం మరియు సమయం, చంద్రుడూ మరియు చంద్ర కక్ష్య, సూర్యుడు మరియు సూర్యుని కక్ష్య, గ్రహసముదాయాలూ, నక్షత్రాలూ, సూర్యోదయం మరియు సూర్యాస్తమయం, చంద్రోదయం మరియు చంద్రాస్తమయం, సూర్య, చంద్ర సిద్ధాంతాలూ, ఇందులోనే గ్రహణాలూ వాటి ఫలితాల గురించి కూడా వివరించబడింది. 

ఖగోళ స్థితి, మరియు భౌగోళ స్థితి, (గ్యూమాన్ 5.00), మానవుల జీవితాలు మరియు వారిపై గ్రహ ప్రభావాలూ, గ్రహాల ఆకర్షణ శక్తి, ఈ అధ్యాయాలతో సమస్త ఖగోళ పరిజ్ఞానాన్ని, మన పూర్వీకులు అప్పుడే చెబితే, మరి నేటి పాశ్చాత్యులు తామే అన్నీ కనిపెట్టినట్లు సొంత డబ్బా కొట్టుకుంటుంటే, మన వారి గొప్పదనాన్ని గమనించలేని మనం, ఇప్పటివారు చెప్పే సుత్తిని నమ్మి, గొర్రెల్లా అదే కరెక్ట్ అని తలాడిస్తున్నాం. కాబట్టి, ఇప్పటికైనా మన భారతీయులు, మన చరిత్రనూ, మన పూర్వీకులు వ్రాసిన గ్రంథాల గురించి, పూర్తిగా తెలుసుకోవడం సమంజసం. మన వారి మేధస్సును పుణికిపుచ్చుకుని, మన దేశాన్ని అన్ని రంగాలలో ముందుంచి, ప్రపంచానికి మన భారతదేశపు విజయాన్ని, సగర్వంగా చాటుదాం. జై భారత్!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes