కర్మకు బాధ్యులు!
ఒక రోజు పార్వతీదేవి ఈశ్వరుని తో.. మానవులు కర్మలు చేస్తుంటారు కదా? ఆ కర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా? లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా? అని అడిగారు..
[ 20 లక్షల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మొదటి గ్రంధం! = https://youtu.be/40259dhpZm4 ]
అప్పుడు పరమశివుడు..
పార్వతీ! దేవుడు ఏ పనీ చెయ్యడు. కానీ, దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు. ఏ పని చెయ్యాలో నిర్ణయించి, కర్మలు చేసేది మానవుడే. ఇందులో దైవ ప్రమేయము ఏదీయు లేదు. పూర్వ జన్మ కర్మ ఫలితంగా, మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి, కర్మలు చేస్తాడు..
మానవుడు పూర్వ జన్మలో చేసిన పనులు దైవములు అయితే, ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు.. అనగా అవే పురుష ప్రయత్నములు..
ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు, వ్యవసాయము వంటిది. దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది.
నేలను త్రవ్వితే, భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. అలాగే, ఆరణి మధిస్తే, అగ్ని పుడుతుంది. అలాగే, ఏ పనికైనా పురుష ప్రయత్నము ఉంటేనే, దైవము కూడా తోడై, చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుష ప్రయత్నము లేకుండా, దైవము సహాయ పడతాడని అనుకుంటే, కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే, దేవుడు ఫలితాన్నివ్వడు.
కనుక పార్వతీ! ఏ పని సాధించాలని అనుకున్నా, పురుష ప్రయత్నము తప్పక కావాలి. అప్పుడే దేవుడు సత్ఫలితాలను ఇస్తాడు..
శుభం భూయాత్!
Link: https://www.youtube.com/post/Ugzl2bdZAKN46bhKY654AaABCQ
Post a Comment