సాంబ్రాణి! Sambrani


సాంబ్రాణి!

సాంబ్రాణితో ధూపం వేయడం ద్వారా, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు. గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా, వారంలోని ఏడు రోజుల్లో, ఒక్కో రోజు, ఒక్కో ఫలితం పొందవచ్చునని, వారు చెప్తున్నారు..

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

రోజువారీగా మనం పొందే ఫలితాలేంటో చూద్దాము..

ఆదివారం:

ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే, ఆత్మబలం, సిరి సంపదలూ, కీర్తి ప్రతిష్టలూ, ఈశ్వరానుగ్రహం లభిస్తుంది..

సోమవారం:

దేహ, మానసిక, ఆరోగ్య వృద్ధీ, మానసిక ప్రశాంతత, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది..

మంగళవారం:

శత్రు భయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటి దృష్టి లోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది..

బుధవారం:

నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది..

గురువారం:

గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా, గురువారం, సకల సత్ఫలితాలూ చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి..

శుక్రవారం:

లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటా విజయాలుంటాయి..

శనివారం:

సోమరితనం తొలగిపోతుంది. ఈతి బాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు..

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgzwB_87bMNKA_sfGnB4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes