శివుడు - ఎడ్లబండి!


శివుడు - ఎడ్లబండి!

సద్గురు:: ఇది ఒక మూడు వందల ఏళ్ల క్రితం జరిగింది. దక్షిణ కర్ణాటకలో ఒక భక్తుడుండేవాడు. అతని తల్లికి వృద్ధాప్యం వల్ల అంత్యకాలం సమీపించడంతో, కాశీకి వెళ్లి విశ్వనాథుడైన పరమశివుని సన్నిధిలో శరీరం విడిచి పెట్టాలని భావించింది. ఆమె తన జీవితకాలంలో కోరిన కోరిక అదొక్కటే. తన కొడుకుతో 'నన్ను కాశీకి తీసుకువెళ్ళు. నాకు ముసలితనం వచ్చింది. నేను అక్కడకు వెళ్లి, శరీరం వదులుతాను' అని చెప్పింది.

బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మలభాసిత శోభిత లింగం

జన్మజ దు:ఖ వినాశక లింగం

తత్ ప్రణమామి సదాశివ లింగం

[ శివపరివారం 8 భాగాలు చూడండి: https://bit.ly/2CsoLBT ]

అతను తన తల్లితో పాటు కాశీకి ప్రయాణమై, దక్షిణ కర్ణాటక అడవుల గుండా నడిచి వెళ్ళడం ప్రారంభించారు. సుదీర్ఘ ప్రయాణం, పైగా వృద్ధురాలు కావడంతో, ఆమెకు సుస్తీ చేసింది. అప్పుడతను ఆమెను తన భుజాలపై వేసుకుని, నడవసాగాడు. కొద్ది సమయంలోనే, అతని శక్తీకూడా క్షీణించసాగింది. ఇప్పుడు ఈ యాత్ర ముందుకు సాగాలంటే, శివుడ్ని వేడుకోవడం తప్ప, మరో మార్గంలేదని భావించిన అతను, 'శివయ్యా! నా ఈ ప్రయత్నం వృధాపోకుండా చూడు తండ్రీ.. నా తల్లి కోరుకున్న ఒక్కగానొక్క కోరిక నన్ను తీర్చనివ్వు.. నేను ఆమెను కాశీకి తీసుకుని వెళ్ళాలి. నీకోసమే మేము అక్కడకు వస్తున్నాం. నాకు శక్తినివ్వుతండ్రీ..' అంటూ వేడుకున్నాడు.

అతను అలా నడుస్తూ పోతున్నప్పుడు, వెనుకగా, ఎడ్లబండి వచ్చేటప్పుడు మోగే గంటల శబ్దం వినబడింది. పొగ మంచులో నుండి ఒక ఒంటెద్దు బండి అతనివైపు రావడం గమనించాడు. ఇదో వింత. ఎందుకంటే, ఆ ప్రాంతంలో ఒంటెద్దు బండి, కేవలం తక్కువ దూరం ప్రయాణించడానికే వాడుతారు. అడవుల గుండా, దూర ప్రయాణం చేయాలంటే, రెండెడ్లు కావాలి. కానీ, వారు అప్పటికే బాగా అలసిపోవడంతో, ఇవేమీ పట్టించుకోలేదు. బండి దగ్గరకు వచ్చినా, దాన్ని నడిపే అతను ముసుగులాంటి బట్ట కప్పుకుని ఉన్నందున, పైగా పొగమంచు వల్ల, అతని మొహం కనిపించలేదు.

అప్పుడతను, 'నా తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఈ ఖాళీ బండిలో మేము ప్రయాణం చేయవచ్చా?' అని అడిగాడు.. బండి నడిపే అతను, తల ఊపుతూ సైగ చేశాడు. ఆ ఇద్దరూ బండి ఎక్కి ప్రయాణించ సాగారు. కొంత సమయానికి, అడవి మార్గంలో కూడా అంతటి సునాయాసంగా బండి కదలడాన్ని గమనించాడు అతను. అప్పుడు అతడు క్రిందకు చూస్తే, బండి చక్రాలేమీ తిరగకుండా, స్థిరంగా ఉన్నాయి. కానీ, బండి మాత్రం పోతూనే ఉంది.. అతను ఎద్దు వైపు చూశాడు.. అది కూర్చుని ఉంది.. కానీ, బండి మాత్రం పోతూనే ఉంది.. అతను బండి నడిపే అతన్ని పరిశీలిస్తే, కేవలం ముసుగు బట్ట మాత్రమే కనిపిస్తోంది.. ముసుగులో ఎవరూలేరు.. ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు. అప్పుడామె, 'ఇంకా అర్ధం కాలేదా? మనం గమ్యానికి చేరిపోయాం.. ఇంకెక్కడికీ వెళ్ళనవసరంలేదు.. ఇక్కడే నా జీవిత ప్రయాణం ముగిస్తాను..' అని చెప్పి, ఆ తల్లి శరీరం విడిచింది.. ఎద్దు, బండి, నడిపేవాడు, అందరూ మాయమయ్యారు!

అతను తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడివారు 'అతను చాలా త్వరగా వచ్చాడంటే.. ఖచ్చితంగా తల్లిని కాశీకి తీసుకుపోకుండా, మధ్యలోనే ఎక్కడో వదిలేసి ఉంటాడ'ని భావించారు. అతనిని 'నీ తల్లిని ఎక్కడ వదిలేశావ్?' అని అడిగారు. అతను 'లేదు, మేము కాశీకి వెళ్ళే పనిలేకుండానే, శివయ్యే మా కోసం వచ్చాడు' అని బదులిచ్చాడు. వాళ్ళు 'ఇదంతా ఒట్టి బూటకం!' అన్నారు. అతను 'మీరేమైనా అనుకోండి. శివుడు మాకోసం వచ్చాడు. అంతే.. నా జీవితం ధన్యమైంది. నాలో నాకు అది తెలుస్తోంది. మీకు తెలియకపోతే నేను చేసేది ఏమీ లేదు.' అన్నాడు. వాళ్లప్పుడు, 'సరే, అయితే నువ్వు శివుడ్ని చూశావనడానికి గుర్తుగా మాకు ఏమైనా చూపించు' అన్నారు. అతను 'నాకు తెలియదు.. ఎందుకంటే, నేను ఆయనని చూడలేదు. నేను ముసుగు ఉన్న బట్టనే చూశాను. అందులో ముఖం కనబడలేదు. అక్కడేమీ లేదు. అంతా ఖాళీ' అన్నాడు..

అప్పుడు.. వాళ్ళందరూ చూస్తుండగా, ఉన్నట్టుండి అతను కనుమరుగైపోవడం గమనించారు.. కేవలం అతని దుస్తులు మాత్రమే కనిపించాయి. అతనే దక్షిణ భారతదేశంలో గొప్ప తపస్వి అయ్యారు. ఆయనెక్కడకు వెళ్ళినా, ప్రజలు ఖాళీ ముఖం చూసి, ఆయనను గుర్తించేవారు..

Link: https://www.youtube.com/post/UgxfIwwxfLnOWrsJpm54AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes