దారిద్ర్యాన్ని తరిమికొట్టే పంచదీప తైల దీపారాధన!
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం ।
దీపేన సాధ్యతే సర్వం దైవ దీపం నమోస్తుతే ।।
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://www.youtube.com/watch?v=a_PB-Y0cWWA ]
మన సనాతన సంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురునివ్వడమే కాక, మనలోని అజ్ఞానాన్ని హరించి, జ్ఞానం వైపుగా నడిపిస్తుంది. దీపానికి వాడే నూనె మనలోని దుర్గుణాలకూ, వత్తి అజ్ఞానానికీ సంకేతం. భక్తితో దీపాన్ని వెలిగించడం ద్వారా, మనలోని అజ్ఞాన తిమిరాలు నాశనమైపోతాయి. రోజు మొత్తంలో ఒక్కసారి కూడా దీపం పెట్టని ఇల్లు, శవం ఉన్న ఇంటితో సమానం. సృష్టిని నిద్ర లేపడానికి ఉదయం పెట్టిన దీపం ప్రతీక అయితే, సంధ్యా దీపం, సూర్యుని యొక్క ప్రతి రూపం. రోజులో రెండు పూటలా దీపం పెట్టడం కుదరని వారు, కనీసం ఉదయం పూటయినా, దీపారాధన చేయాలి. దీపం మనలోని ద్వేషం, అసూయ, అహంకారాలను తొలగిస్తుంది. అటువంటి దీపారధన సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలూ, దీపారాధనకు వాడే నూనెలు, ఎటువంటి ప్రతిఫలాలను కలిగిస్తాయి? వంటి విషయాలను ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..
దీపారాధన చేసే ముందు, ప్రమిదలో నూనె పోసిన తరువాతే, వత్తులను వేయాలి. వత్తులు వేసిన తరువాత నూనె వేయకూడదు. దీపపు కుందులను ప్రతిదినం శుభ్రం చేసిన తరువాతే, తిరిగి దీపారాధన చేయాలి. ముందు రోజుటి ప్రమిదలలో దీపారాధన మంచిది కాదు. దీపం వెలిగించేటప్పుడు, ఒక్క వత్తిని పెట్టకూడదు. కనీసం రెండు వత్తులైనా ఉండాలి. దీపం వెలిగించిన తరువాత, దానికి నమస్కరించి, గంధం బొట్టు పెట్టి, పుష్పం, అక్షితలూ సమర్పించాలి. ‘దీపం’ లక్ష్మీ దేవికి సంకేతం. అందుకే, దీపారాధన చేసేటప్పుడు, భగవంతుణ్ణి స్మరిస్తూ, మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి.
ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన, ఆర్థిక సమస్యలు దూరమై, ఆరోగ్యం, ప్రశాంతతా, ఆనందం కలుగుతుంది.
నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన, మనల్ని వేధించే సమస్యలూ, మనకెదురయ్యే కష్టాలూ, చెడు ప్రభావాలూ తొలగిపోతాయి.
శని దోషం ఉన్నావారూ, శని గ్రహ శాంతి కోసం ప్రయత్నించే వారూ, నువ్వుల నూనె దీపం పెట్టడం శ్రేయస్కరం.
ఆముదంతో దీపారాధన చేయడం వలన, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
వేప నూనె, ఇప్పనూనె, నువ్వులనూనె, కొబ్బరి నూనె, ఆముదం, ఈ అయిందింటినీ కలిపి చేసే పంచ దీప నూనెతో దీపారాధన చేయడం వలన, గృహంలో శాంతి నెలకొనడమే కాకుండా, పేదరికాన్ని కూడా మన దరి చేరనివ్వదు. ఈ దీపం మనలోని చెడు ఆలోచనలను కూడా తరిమేస్తుంది.
Link: https://www.youtube.com/post/Ugwl3Ng1bF3M91plwOB4AaABCQ
Post a Comment