ఎంతటి కష్టాన్నయినా తొలగించే చిన్న స్తోత్ర పారాయణ!


ఎంతటి కష్టాన్నయినా తొలగించే చిన్న స్తోత్ర పారాయణ!

ఈ సారి దుర్గా నవరాత్రులు ఈ రోజు నుంచి, అంటే గురువారం 07/10/2021 నుండి ప్రారంభమైన శుభ సందర్భాన.. అందరికీ ఒక నివారణా స్తోత్రాన్ని అందించడం జరుగుతోంది. ఎటువంటి కష్టమైనా, ఇబ్బంది అయినా, ఈ స్తోత్ర పారాయణ వల్ల తొలుగి, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించే యోగ్యతను, అమ్మ కలిగిస్తుంది..

[ దసరా నవరాత్రుల్లో ఈ విధంగా ఆరాధన చేయడం సర్వశుభకరం! = https://youtu.be/11tigSsk1w4 ]

బుధవారం అమావాస్య వెళ్ళిన తరువాత వచ్చే మొదటి గురువారం, మొదలు పెట్టాలి. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలనుకున్నా.. అందరూ శ్రద్ధాభక్తులతో ఈ స్తోత్రాన్ని చదవగలరు.. చిన్నది అవడం మూలాన, పొద్దున్న, సాయంత్రం కూడా చక్కగా పారాయణ చేసుకోవచ్చును..
      
శ్రీ  దుర్గా ద్వాత్రింశన్నామ  మాల.. ఈ  శ్లోకం  చాలా శక్తిమంతమయిన  శ్లోకం..

దుర్గాదేవికి  సంబంధించిన 32 నామాలు, ఇందులో ఉన్నాయి. ఈ శ్లోకం దుర్గా సప్తశతిలో కనిపిస్తుంది. ఈ  శ్లోకాన్ని ఎవరితే రోజూ  చదువుతారో, వారు  అన్ని భయాలనుంచీ, కష్ఠాలనుంచీ విముక్తులవుతారు. అందరూ తప్పకుండా, నమ్మకంతో  చదవండి, జపించండి..

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా
ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ ధారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః

ఎవరైనా అమితమైన కష్టాలను అనుభవిస్తున్నారనుకున్న వారికి, ఈ స్తోత్రాన్ని అందించండి..

ఓం శ్రీ మాత్రే నమః!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes