ధర్మం! Dharma

 

ధర్మం!

ఏవైనా ప్రకృతి ఉపద్రవాలూ, వేదనలూ కలిగితే, 'ధర్మానికి దెబ్బ తగలడం వల్లనే, ఇలా జరిగింది' అంటూ వుంటారు.. ఇది మూఢ నమ్మకమా? భూమి క్రింద మార్పులు జరిగితే, భూకంపం వస్తుంది. సముద్రంలో అల్ప పీడనాదులు కలిగితే, తుఫానులొస్తాయి. అంతేకానీ, ధర్మము వల్ల ఉపద్రవాలు కలిగాయనడం సమంజసమా?

ఒంట్లో ఏ బాక్టీరియానో, వైరస్సో చేరితే, అనారోగ్యం వస్తుంది. నిజమే.. కానీ, ఆ ప్రమాదకర పదార్థం చేరడానికి, కలుషిత పదార్థాల వాడకం వంటి మరేదో కారణం ఉంటుంది కదా? కనబడే కారణాలకు మూలమైన కనబడని కారణాలు, చాలా ఉంటాయి.

పై పై కారణాలను, భౌతిక విజ్ఞానం చెబితే, ప్రభావవంతమైన సూక్ష్మ కారణాలను, సూక్ష్మ విజ్ఞానం చెబుతుంది. 'కొమ్మ లేనిదే పళ్లు లేవు' అనేది ఒక కారణం. కానీ, 'మూలం లేనిదే, కొమ్మే లేదు' అనేది ముఖ్య కారణం. ధర్మానికీ, ప్రకృతికీ, అవినాభావ సంబంధముంది. ప్రకృతి జడపదార్థం కాదు. అది చైతన్యవంతం.

ప్రకృతి శక్తులు, మానవ ప్రవర్తనల్ని పరిశీలిస్తుంటాయి. ధర్మానికి విఘాతం ఏర్పడితే, పంచ భూతాలు క్షోభిస్తాయి. ఇది విశ్వ నియమం. కేవలం తాత్కాలిక, భౌతిక సుఖాలను దృష్టిలో పెట్టుకుని, శాశ్వత ధర్మాన్ని దెబ్బతీస్తే, ప్రకృతి శక్తులు విజృంభించక తప్పవు. సత్యం, శుచి, శుద్ధత, ధర్మమైన సంపాదన, అహింస, ఇంద్రియ నిగ్రహం, ఇవి ప్రధాన ధర్మ సూత్రాలు. వీటిని విడనాడినప్పుడు, దుష్ఫలితాలను అనుభవించక తప్పదు.. 

ధర్మో రక్షతి రక్షితః!

Manchimata Videos:

[ అమృత హస్తం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]

[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]

[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]

[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]

[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]

[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]

[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]

[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes