దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠ!


దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠ!

దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగినపుడు, మంత్రము, యంత్రము, తంత్రములను ఉపయోగిస్తారు. భగవత్శక్తిని విగ్రహాలలో నిలపడానికి, ఈ మూడూ సాధనములు..

[ స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం! = https://youtu.be/451l4ymbZFs ]

భగవత్తత్త్వాన్ని తెలిపే బీజాక్షర సంపుటినే మంత్రము అంటారు. ఆ మంత్రాలను మన ఋషులు, తపః సమాధిలో విని, కనుగొని, లోకాన ప్రకాశింపజేశారు. మంత్రాలను పరిశుద్ధ మనస్సుతో, విశ్వాసంతో, పలుమార్లు జపిస్తే, ఆ మంత్రాలకు చెందిన దైవశక్తి ,కోరిన ప్రతిమలో నిలుస్తుంది. అప్పుడా ప్రతిమలే, దేవతా మూర్తులవుతాయి.

'మంత్రాధీనంతు దైవతమ్' అని శాస్త్ర వచనం. ఆ విగ్రహాలను ధాన్యాదివాసం, జలాధివాసం చేయించి, మంత్రముల ద్వారా వాటిలోకి భగవత్కళలను ఆవాహన చేస్తారు. ఆ ఆవాహన మంత్రాన్నే, ఒక రాగి, లేదా వెండి రేకుపై చెక్కి, ఆవాహన చేయబడిన భగవత్కళలు విగ్రహంలో స్థిరంగా ఉండటానికి, ఆ రేకులను విగ్రహంతో పాటు ప్రతిష్ఠ చేస్తారు.

ఆ మంత్రాలను చెక్కిన రేకులనే, యంత్రాలు అంటారు. ఆ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ పద్ధతిని అంతటినీ, తంత్రము అంటారు. ఆవిధంగా, మంత్ర, యంత్ర, తంత్రముల వలన, ఆలయంలో ప్రతిష్ఠింపబడిన దివ్య మంగళ విగ్రహమును మనం దర్శించి, ధన్యులమవుతుంటాం.. సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/Ugyqgi10Z5UExGCsteh4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes