భగవద్గీత విశిష్టత! Significance of Bhagavad Gita


భగవద్గీత విశిష్టత!

లోకంలో మరే ఇతర గ్రంధానికీ లేని విశిష్టత, ఒక్క ‘భగవద్గీత’కు మాత్రమే ఉంది..

1) ఏమిటా విశిష్టత?

అవతారమూర్తులూ, మహర్షులూ, మహానుభావులూ జన్మించినప్పుడు, వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా, వారి జన్మదినాన్ని ‘జయంతి’గా జరుపుకుంటారు. అలాగే, భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల, ‘గీతాజయంతి’ ని జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.

[ ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? = ఈ వీడియో చూడండి: https://youtu.be/451l4ymbZFs ]

2) ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం?

సుమారు 5200 సంవత్సరాల క్రితం, శ్రీకృష్ణుని మహానిర్యాణం సమీపిస్తున్న సమయంలో, కలియుగం కారుమేఘంలాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో, ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ, మానవజాతిపై వెలుగులు విరజిమ్ముతూ, భగవద్గీత ఉదయించింది.

3) ఏముంటుంది ఈ భగవద్గీతలో?

ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో.. ఏది ఆత్మ, పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో.. ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో.. అదే ఉంటుంది.

నూనె రాస్తే రోగాలు పోతాయి.. దయ్యాలు వదిలిపోతాయి.. లాంటి మూఢనమ్మకాలు ఉండవు. 

నన్ను నమ్మనివాణ్ని చంపండి.. అనే ఉన్మాదం ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోనివాణ్ని నరకంలో వేసి కాలుస్తా.. అనే పైశాచికత్వం ఉండదు..

4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి, జీవితంపై ఆసక్తి పోతుందా?

భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు.. గాంఢీవాన్ని ధరించి, కదనక్షేత్రానికి వెళ్లాడు. 'భగవద్గీత' కర్తవ్య విముఖుడైనవాడిని, కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది..

5) భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా?

ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ, భగవద్గీతని కోట్ చేసినవాళ్ళే.. భగవద్గీతని మొదటిసారి చదివిన రోజు, నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే..

6) ఇంత ఉన్నతంగా ఉంటే, భగవద్గీతే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా? ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు..?

కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.. విదేశీయుల్లా కత్తి పట్టుకుని, రక్తపాతం సృష్టించి, భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.

బ్రిటిష్ వాళ్లూ, మొహమ్మదీయులూ మతవ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలూ, తద్వారా జరిగిన విద్వంసం.. చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి. వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడులు చేసి, దురాక్రమణలుజేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని.. ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే, భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా, కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణ భక్తులుగా మార్చారు.. 

ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనో వేగంతో పరుగులు తీస్తుందనడానికి, ఇదే నిదర్శనం..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgxsQDKIQf3TNS6_C2p4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes