భావనామాత్ర సంతుష్టయే నమః!
భగవన్నామ స్మరణ చేసేటపుడు, భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి. నామమునకు తగిన రూపం ప్రత్యక్షం కావాలి. అంతేకానీ, నోటితో నామము పలుకుతూ, మనసులో ఏవో ఆలోచనలు చేస్తుంటే, అది స్మరణ అనిపించుకోదు.. ఇలా ఎంత సమయం చేసినప్పటికీ, ఏ కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. రికార్డు చేయబడిన పాట వేస్తే, చక్కగా పాడుతూ ఉంటుంది. అంత మాత్రాన, ఆ పాటలకు భగవంతుడు కదలి వస్తాడా!?
మనం నేడు మ్యూజిక్ సిస్టమ్ మాదిరిగానే చేస్తున్నాం.. కనుకనే అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు లొంగేవాడు కాదు. ఆయనకు భావమే ప్రధానం. భావం సరిగా ఉన్నపుడే ఆయన పలుకుతాడు.. ప్రార్థనకు సమాధానమిస్తాడు..
Post a Comment