కర్మయోగం!
కర్మయోగం అంటే, మనం చేసే కర్మలతో మనం పూర్తిగా ఏకమై ఉండడం.. అంటే, చదువుకుంటున్నప్పుడు చదువుతోనే ఏకమై ఉండాలి.. మరి భోజనం చేసేటప్పుడు, ఆ ప్రక్రియతోనే ఏకమై ఉండాలి. ఏదైనా నేర్చుకునేటప్పుడు, నేర్చుకునే ప్రక్రియపై ఏకమై, ఆ యా క్రియలతో, కర్మలతో, పూర్తిగా లీనమై వుండటమే 'కర్మయోగం'..
[ ‘మహాభారతం’ మానవాళికి అందించే నర్మగర్భ రహస్యాలు! = https://youtu.be/bDCCIC1IwDk ]
'యోగః కర్మసు కౌశలం' అని, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు.. ‘కర్మయోగం అంటే పనులు చేయడంలో నేర్పరితనం’ అన్నారు.. ఏమిటి ఆ నేర్పరితనం అంటే, కర్మ చేస్తూ ఉండి కూడా, దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా, మంచి పని చేసి కూడా, దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం.. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు..
కర్మయోగి కానివాడు, స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ, జనన మరణాలనే చక్రంలో తిరుగుతూంటాడు. ఇతనికి మోక్షం ప్రస్తావన లేదు.. అలా కాకుండా కర్మయోగి, లోకం మేలు కోసం, ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే, తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పని ముట్టుగా భావిస్తూ, పనిచేయడం.. దీనివల్ల ప్రయోజనం, చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు, పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే, అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే, ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే, మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని, వేదాంతం చెబుతుంది..
Link: https://www.youtube.com/post/Ugzekis-JgB3Y3ymd9R4AaABCQ
Post a Comment