మీరేమంటారు?
ఇంటి ముందు చెట్లు పోయి, ఇంట్లో A.C లు వచ్చాయి..
ఇంటి బయట పొయ్యి పోయి, ఇంట్లో గ్యాస్ వచ్చింది..
ఇంటి ముందు అరుగులు పోయి, ఇంట్లో టీవీ వచ్చింది..
ఇంటి ఆవరణలో పెరడు పోయి, పాలరాతి ఫ్లోర్ అయింది..
ఇంటి బయట కుండ పోయి, ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది..
ఒంట్లో బద్ధకం చేరి, ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది..
ఇంటి బయట రుబ్బురోలు పోయి, ఇంట్లో మిక్సీ అయింది..
ఇంట్లో పుస్తకాలు పోయి, చేతిలో మొబైల్ అయింది..
ఇంటి ముందు రంగవల్లులు పోయి, పెయింటింగ్ లు వచ్చాయి..
ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాధలయ్యారు..
ఇంటి బయట మరుగుదొడ్లు, ఇంట్లో ఎటాచ్డు బాత్రూమ్స్ అయ్యాయి..
అమ్మ, నాన్న, అత్త, మామ, బాబాయ్, పిన్ని పిలుపులు, మామ్, డాడ్, ఆంట్, అంకుల్ గా మారాయి..
శరీరానికి రాసే సున్ని పిండి పోయి, మార్కెట్లో సబ్బులయ్యాయి..
జుట్టుకు పెట్టుకునే కుంకుడు కాయలు పోయి, షాంపూలు అయ్యాయి..
గడపకు కట్టే పచ్చని తోరణాలు, ప్లాస్టిక్ పువ్వులయ్యాయి..
వంట చేసుకునే మట్టి పాత్రలు, ఇంట్లో స్టీల్, ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి..
ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి, వీధిలో మెడికల్ షాపులకు వలసకట్టాము..
శరీరాన్ని కప్పుకునే దుస్తులు పోయి, ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి..
ముఖానికి రాసుకునే పసుపు, మీగడ పోయి, మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి..
పొడుగైన వాలు జాడలు, కొత్తిమీర కట్టలయ్యాయి..
చేతికి అందంగా పెట్టుకునే గోరింటాకు పోయి, మెహెందీ కోనులయ్యాయి..
కుటుంబమంతా కలిసి జరుపుకునే పండుగలూ, పబ్బాలూ, వాట్సప్ స్టేటస్ గా మారాయి..
సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి, డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి..
ఎడ్లబండ్లు పోయి, పెట్రోల్ వాహనాలు వచ్చాయి..
పచ్చని పొలాలు ఫ్యాక్టరీలూ, భవంతులయ్యాయి..
కుటుంబంలో అనుబంధాలు, ఆర్ధిక సంబంధాలయ్యాయి..
ఇంటి చుట్టూ బంధాలు, అవసరాలకు పరిమితమయ్యాయి..
మనిషిలో మంచీ, మానవత్వం పోయి, మోసం ద్వేషం పెరిగాయి..
సంపాదన ధ్యాసలో మనిషి జీవితం, యాంత్రికంగా మారింది..
డబ్బే పరమావధిగా, వస్తువులే హోదాగా భావించే మనిషి, రాక్షషుడయ్యాడు..
నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగేది..
నేటి మనిషి జీవితం, ఒత్తిడీ, ఆందోళనలూ, అనారోగ్యంతో సాగుతోంది..
ఆధునికత మాయలో పడి ప్రకృతిని కలుషితం చేసి, మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము..
ఏమంటారు? చెప్పండి..
Post a Comment