పాంచజన్యము!
శ్రీ మహా విష్ణువు యొక్క పంచాయుధములలో ఒకటైన శంఖమును, 'పాంచజన్యము' అని అంటారు..
[ కురుక్షేత్ర యుద్ధానికి ముందు శంఖనాదం! = https://youtu.be/G-s2rBQkEbI ]
శ్రీ కృష్ణుడి శంఖం పేరు 'పాంచజన్యం'. ద్వాపర యుగంలో బలరాముడూ, కృష్ణుడూ, సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఒక సారి, సాందీప ముని కుమారుడు సముద్రంలో స్నానం చేయుచుండగా, కెరటాల ఉధృతి వలన, సముద్రము లోకి కొట్టుకు పోయాడు. ఆతడిని 'పంచజనుడు' అనే రాక్షసుడు మ్రింగివేశాడు.
బలరామ కృష్ణులు తమ గురువు గారైన సాందీప మహర్షికి గురు దక్షణగా, ఆయన పుత్రుడుని తీసుకు రావాలని తలచి, గురుపుత్రుడు స్నానానికి వెళ్ళిన సముద్ర తీరానికి వెళ్లి సముద్రుడిని అడుగగా, సముద్రుడు, పంచజనుడనే రాక్షసుడు వారి గురు పుత్రుడిని మ్రింగివేసినాడని చెప్పాడు. అప్పుడు వారు పంచజనుడిని వెతికి, అతడిని చంపి, అతడి శరీరమును చీల్చగా, శంఖము లభించింది.
అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ శంఖమును తీసుకుని, యమపురికి వెళ్లి, అక్కడ ఆ శంఖమును మ్రోగించగా.. ఆ శబ్దానికి యముడు అదిరిపడి వచ్చి, శ్రీ కృష్ణుని చూసి, వచ్చినపనిని తెలుసుకున్న యముడు, వారి గురు పుత్రుడిని శ్రీ కృష్ణుడికి అప్పగించాడు. శ్రీ కృష్ణుడు అతడిని గురువు గారికి అప్పగించి, పంచజన్యుడి శరీరంలో దొరికిన శంఖమును, ఆ నాటి నుండీ తాను ధరించాడు.
క్రింద చూపించిన శంఖం, శ్రీ కృష్ణుడు పూరించిన 'పాంచజన్య శంఖు'గా చెబుతారు. ఇది ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉంది!
ఓం నమో భగవతే వాసుదేవాయ!
Link: https://www.youtube.com/post/UgymJv0cxAByaAMMag94AaABCQ
Post a Comment