గర్వము - అహంకారము!
మనిషికి గర్వం రావటానికి అనేక కారణాలుంటాయి. సామాన్యంగా ఐశ్వర్యమో, పాండిత్యమో, అధికారమో గర్వానికి కారణాలవుతాయి. కానీ, ఈ గర్వమే తన శత్రువని మనిషి గ్రహించాలి. ఎందుకంటే, దాని మూలంగా అతనికి మున్ముందు అనర్ధం జరుగుతుంది.
[ ఆది శంకరాచార్యుల జీవిత రహస్యాలు = https://youtu.be/srTCWknBC7Q ]
అంతకంటే ఎక్కువగా, గర్విష్ఠియైన మనిషి, తప్పుడు పనులు చేస్తాడు. తనను ఎవరూ అడ్డుకోలేరనే భ్రమలో వుంటాడు. తన దుష్కర్మల ఫలితాన్ని, అతను తప్పకుండా అనుభవిస్తాడు. వీటన్నింటినీ తప్పించుకోవాలంటే, గర్వాన్ని విడనాడాలి.
శ్రీ శంకర భగవత్పాదుల వారి మాటలలో..
మాకురు ధనజన యౌవన గర్వమ్ |
హరతి నిమేషాత్ కాలః సర్వం ||
ధనమో, యవ్వనమో, పాండిత్యమో, లేక అధికారమో ఉన్నదన్న కారణంగా, ఏ మానవుడూ గర్వించరాదు. ఎందుకంటే, కాలం సర్వాన్నీ హరిస్తుంది. అంటే, అవి ఏవీ శాశ్వతం కాదు.
శ్రీ శంకర భగవత్పాదులవంటి మహనీయులు ఎంతటి పండితులైనా, ఏమాత్రం గర్వానికి లోనుకాలేదు. అందువలననే, ప్రజలు వారిని మహా పురుషులుగా కీర్తించారు. కాబట్టి, మనిషి ఏకారణంతోనూ గర్వానికి లోను కాకూడదు. వినయంతో జీవించాలి.
తస్మాదహంకార మిమం స్వశత్రుమ్ భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతమ్ |
భుంక్ష్వాత్మసామ్రాజ్యసుఖం యధేష్టమ్ ||
అన్న భగవత్పాదుల సూక్తిని, ప్రతియొక్కరూ మననం చేస్తూ, నిరహంకారమైన జీవితాన్ని గడపాలి..
Post a Comment