దుష్టశక్తుల ప్రవాహాన్ని కర్పూరం కాల్చడం ద్వారా ఎలా గుర్తించాలి? Benefits of Camphor

 



దుష్టశక్తుల ప్రవాహాన్ని కర్పూరం కాల్చడం ద్వారా ఎలా గుర్తించాలి?

కర్పూరంలో అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కర్పూరం, హిందూ సంస్కృతిలోని ముఖ్యమైన భాగాలలో ఒకటి. కర్పూరం అనేది, అన్ని ప్రతికూల శక్తులనూ తొలగిస్తుంది. కర్పూరం యెక్క వాసన, మన పరిసరాలను పూర్తిగా శుభ్రపరుస్తుంది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/4L1XLXFEFc0 ​]

అంతేకాదు, దీని పొగ, అన్ని దుష్టశక్తులనూ, మరియు ప్రతికూల శక్తులనూ సంగ్రహిస్తుంది, వాటిని పూర్తిగా తొలగిస్తుంది. కాబట్టి, మన ఇంట్లో పూజ ప్రారంభించే ముందు, ప్రతిరోజూ కర్పూరం వెలిగించాలి. ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలేంటి? కర్పూరం కాల్చడం ద్వారా, దుష్టశక్తుల ప్రవాహాన్ని ఎలా గుర్తించాలి? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

సాధారణంగా, పూజలూ, వ్రతాలూ చేసేటప్పుడు మాత్రమే, కర్పూరం వెలిగించి, దేవునికి హారతినిస్తాం. కానీ, కర్పూర హరతిని నిత్యం వెలిగించడం వలన, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. కర్పూరం వెలిగించినప్పుడు, భక్తులు దేవతలకు దగ్గరవుతారు. హారతినిస్తూ, ప్రత్యేక భక్తి గీతాలను పాడతారు. కర్పూరం అనేది పూర్తిగా దహనమైపోతుంది. హారతినిస్తూ, దేవుణ్ణి దర్శించడం వలన, మనలోని దుర్గుణాలు కూడా కరిగిపోతాయి. కర్పూరం వెలిగించినప్పుడు, మంట కొద్దిగా వెలిగి, తక్కువ పొగ మాత్రమే వస్తుంటే, ఆ ఇంట్లో వారికి నరదృష్టి సోకినట్లు అర్థం.

అదే అధిక మోతాదులో మండుతూ, ఎక్కువ పొగ వెలువడితే, ఆ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్లు. కర్పూరాన్ని వెలిగించనప్పుడు, అది జ్వలించే శబ్దంతో మండి, వెంటనే ఆరిపోతే, ఆ ఇంట్లో ఏదో కీడు జరుగబోతోందని అర్థం చేసుకోవాలి. కర్పూరాన్ని వెలిగించేటప్పుడు, కొన్ని పద్ధతులు పాటించాలి. మన పెద్దలు దిష్టి తీసేటప్పుడు ఏ విధంగానైతే చేస్తారో, అలానే చేయాలి. దిష్టి తీసే వ్యక్తి కుడి చేతిలో కర్పూరం ముక్కను పట్టుకుని, పాదాల నుండి, తల పై వరకూ, మూడు సార్లు సవ్యదిశలో తిప్పాలి. తరువాత దానిని నేలపై పడేసి, వెలిగించాలి. అలా చేయడం వలన, వ్యక్తి యొక్క పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది.

ఒక వ్యక్తి తరుచుగా అనారోగ్యం పాలవుతున్నా, వారు తలపెట్టిన ప్రతీ పనిలో విఘ్నాలు ఎదురవుతున్నా, ఇంట్లో మనశ్శాంతి కరువైనా, కర్పూరంతో దిష్టి తీయడం వలన, ప్రయోజనం కలుగుతుంది. మన నిత్య పూజలో కర్పూరాన్ని వెలిగించడం వలన, సంపద, శ్రేయస్సూ కలుగుతాయి. కర్పూరం కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలనే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. కర్పూరం నుండి వెలువడే పొగ, మరియు వాసన, రుమాటిజం, మూర్ఛ, మరియు హిస్టీరియాతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. కండ్ల కలక నుండి బయటపడడానికి, కర్పూరం పనిచేస్తుంది. కర్పూరం యొక్క సుగంధం, లక్ష్య ప్రకంపనలను గ్రహించి, అగ్ని సహాయంతో, వాటిని నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

సర్వేజనాః సుఖినోభవంతు!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes