ఆ ఇద్దరి మీద మాత్రం, ఎప్పుడూ నోరు చేసుకోవద్దు! - చాణక్య నీతి సారం!
చాణక్యుడు, సామాన్య శక పూర్వం, 350-283 మధ్య కాలంలో, మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రీ, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/RN49RyBXqQM ]
కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా ఆయనను వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధపురుషార్ధాలలో రెండవదైన 'అర్ధ' పురుషార్ధమును గురించి, అర్ధశాస్త్రాన్ని రచించారు. ఆయన రచించిన నీతిశాస్త్రం, చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి గాంచింది. తన శిష్యులకు చాణుక్యుడు బోధించిన అతి ముఖ్యమైన విషయం, మన నాలుకను అదుపులో ఉంచుకోవటం.. ఆ వివరాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులపై, ఎప్పుడూ నోరు పారేసుకోరాదనీ, వారిని తిట్టడం, దూషించటం, దుర్భాషలాడటం చేయరాదనీ బోధించారు.
అత్యంత విలువైన జీవిత సత్యాలను మనకు బోధించిన ఆచార్య చాణుక్య నీతిని, మనమంతా తెలుసుకుని ఆచరిస్తే, మన జీవితం అత్యంత సుగమంగా సాగుతుంది.
చాణక్యుడు చెప్పే వాక్య ప్రయోగం కఠినంగా అనిపించినా, అందులోని విషయం మాత్రం, అత్యంత క్లిష్ట సమయంలో కూడా, మనకు దిశా నిర్దేశం చేస్తాయి.
చాణక్య నీతిని తెలుసుకోవటం, నేటి పరిస్థితుల్లో అత్యవసరం.
వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన జీవితమైనా, విజయం సాధించాలంటే, చాణుక్య నీతి, అన్ని కాలాల్లోనూ చక్కని మార్గం చూపే మార్గదర్శి.
మనల్ని అత్యుత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దే శక్తి ఉన్న ఈ నీతి సారాన్ని మనం గ్రహిస్తే, ఇక తిరుగుండదు.
మనకు జన్మనిచ్చి, మాట నేర్పిన తల్లిదండ్రులను, చెడు మాటలతో హింసించరాదని బోధించారు. ఇలా చేస్తే, అది ‘శాపం’గా మారుతుందని కూడా, ఆయన హెచ్చరించారు. తల్లిదండ్రులపై ఎప్పుడూ పరుష మాటలు ప్రయోగించవద్దని, ఆయన బోధించారు.
ఇది అన్ని తరాల వారికీ వర్తిస్తుందన్న చాణక్య నీతిని, మానవ జాతి సదా గుర్తుంచుకోవాలి. కర్మ పాశం అంటే ఇదే..
మనం ఎవరి ముందు మాట్లాడుతున్నాం, ఎవరి గురించి ఎలాంటి పదాలు ప్రయోగిస్తున్నామన్నది, ఎప్పుడూ గుర్తెరిగే మాట్లాడాలని, చాణుక్యుడు హెచ్చరించారు.
ఒక్కసారి సంధించిన బాణాన్ని, మళ్లీ వెనక్కు తీసుకోగలమా? సరిగ్గా ఇలాంటిదే, మీ తల్లిదండ్రులపై దురుసైన మాటల ప్రయోగం.. దీని పర్యవసానం భరించక తప్పదు..
అజ్ఞానంతో, అమ్మా, నాన్నలను తిట్టకూడదంటూ, ఇదంతా కర్మ అని ఆయన తన బోధనల్లో వివరించారు. బాగా కోపం వచ్చినప్పుడూ, అసహనంతో రగిలిపోతున్నప్పుడూ, తల్లిదండ్రులే పిల్లలకు టార్గెట్ అవుతారు. ఇది లోకంలో, అత్యంత సహజంగా జరిగే పని. ఇలాంటి సందర్భాల్లో, తల్లిదండ్రులను బాధపెట్టే కఠిన పదాలు ప్రయోగిస్తుంటారు. కానీ, పిల్లల ఉద్దేశం నిజంగా అది కాకపోయినప్పటికీ, ఆగ్రహాన్ని అణచుకోలేక, ఇలాంటి మాటలు మాట్లాడతారని, ఆచార్యుల వారు చెప్పుకొచ్చారు.
చెడ్డ ఉద్దేశం లేకపోయినప్పటికీ, ఇలాంటి మాటలు తూలిన దాని పర్యవసానాన్ని, భవిష్యత్తులో అనుభవించక తప్పదనీ, ఇవే శాపాలై, వారిని వేధిస్తాయనీ, చాణుక్యుడు హెచ్చరించారు.
ఒకప్పుడు మాటలు నేర్పిన తల్లిదండ్రులపై మాటలు తూలటం మహా పాపమనీ, కోపంలో కళ్లు మూసుకుపోయి, ఇలాంటి పనులు చేయరాదనీ, నీతిని బోధించారు. మొదటి గురువులైన తల్లిదండ్రులను బాధ పెట్టకండి.. పేగుబంధాన్ని తల్లడిల్లనివ్వకండి.. ప్రేమబంధాన్ని గౌరవించి, చివరిదాకా నిలబెట్టండి.. కర్మ సిద్ధాంతాన్ని మరవొద్దు.. ఇతరులపై మనము చూపించే ద్వేషమైనా, ప్రేమైనా, యధాతథంగా మనకు తిరిగి అందుతుంది.
సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgwGVGZZdvR03An3iId4AaABCQ
Post a Comment