సాంబ్రాణీ ధూపం!
సాంబ్రాణీ ధూపం వేయడం ద్వారా, ఇంట్లో వున్న ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ, ఇంటి నుంచి తొలగిపోతుందని, మన పెద్దలు చెబుతారు. గుగ్గిలంతో సాంబ్రాణీ ధూపం వేయడం ద్వారా, వారంలో ఒక్కో రోజున ఒక్కో ఫలితం పొందవచ్చునని, వారు చెబుతారు..
[ యోగదాయకాలు = https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gbymeGSPrHnrlV2KXARunVC ]
ఆదివారం..
ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణీ ధూపాన్ని వేస్తే, ఆత్మబలం, సిరిసంపదలూ, కీర్తి ప్రతిష్టలూ, ఈశ్వరానుగ్రహం లభిస్తాయి..
సోమవారం..
దేహ, మానసిక, ఆరోగ్య వృద్ధీ, మానసిక ప్రశాంతతా, అమ్మవారి అనుగ్రహం లభిస్తాయి..
మంగళవారం..
శత్రు భయం, ఈర్ష్యా, అసూయా తొలగిపోతాయి, కంటి దృష్టి లోపాలుండవు, అప్పుల బాధ తొలగిపోతుంది, కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది..
బుధవారం..
నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవచ్చు, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది..
గురువారం..
గురువారం రోజున గుగ్గిలంతో సాంబ్రాణీ ధూపం వేయడం ద్వారా, సకల సత్ఫలితాలూ చేకూరుతాయి, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి..
శుక్రవారం..
లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది, శుభకార్యాలు చోటుజేసుకుంటాయి, అన్నింటా విజయాలు ప్రాప్తిస్తాయి..
శనివారం..
సోమరితనం తొలగిపోతుంది, ఈతి బాధలుండవు, శనీశ్వరుడూ, భైరవుని అనుగ్రహం పొందుతారు..
సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgzkE2kbdIDdoQVMCYh4AaABCQ
Post a Comment