వైదిక ధర్మమార్గం!


వైదిక ధర్మమార్గం!

మన ధర్మాన్ని సనాతన వైదిక ధర్మం అంటాం. సనాతనం అంటే, ఏ కాలానికైనా అవసరమైనది, ఎప్పుడూ ఏక రూపంలో ఉండేది అని అర్థం..

ఈ సృష్టిలో మానవజన్మ, పుంస్త్వ లక్షణాలు, విప్రత్వం.. ఇవి లభించటం, నిజంగా వరమే..

అయితే, ఈ లక్షణాలతో ముందుకు పోయినప్పుడే గదా ప్రయోజనం.. నా దగ్గర సరైన మందు ఉందిగదా అని కూర్చుంటే, రోగం తగ్గిపోతుందా? ఆ మందు సేవిస్తేనే గదా ఉపయెగం..

అలాగే, పై లక్షణాలు గలవాడు ముందుకు పోవాలంటే, ఏమిటి మార్గం?

వేదాలు చూపిన ధర్మమైన మార్గంలో ముందుకు నడవాలనే నిష్ఠ ఉండాలి. 

మన బుద్ధిని ఏకాగ్రం చేసుకోవటానికి, వేదాలు కొన్ని మార్గాలు మనకు చూపుతాయి.

అవే.. నిస్వార్థ కర్మాచరణ, మానసిక పూజ, జపం, తపం (ధ్యానం), శ్రవణ, మనన, నిధిధ్యాసన, మొదలైన సాధనలు. ఇవి సక్రమంగా ఆచరించినప్పుడు, మన అంతరంగం, పరిశుద్ధమౌతుంది. మనస్సు శాంతించి, ధ్యానానుకూలమవుతుంది. భగవంతుని పట్ల ఏకాగ్రత కుదురుతుంది.

కనుక, 'సత్త్వగుణ ప్రధానులై, వేదాంత శాస్త్రాలను శ్రవణం చేస్తూ, అవి చూపే మార్గాన ప్రయాణం చేయాలి'. అట్టి మనోబుద్ధులు కలిగి ఉండటమే, గొప్ప అదృష్టం. వేద విరుద్ధ మార్గాల వైపుకు ఆకర్షించబడితే, ఈ లభించిన జన్మ కూడా వృధాయే. వేదాలనూ, వేదాంతాన్నీ, భగవద్గీతనూ ఎగతాళి చేసే వారితో, చేరకూడదు..

ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgxAfmgmPTF4EHFO6Et4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes