జీవిత సత్యాలు - ఈ పాటను మీరు నిశితంగా గమనించారా?
సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
ఎన్ని కన్నీళ్ల ఉసురిదీ వెంటాడుతున్నది నీడల్లే కర్మ..
ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ..
సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
పాపం పుణ్యం రెండింటికి నీదే పూచి..
కన్ను తెరిచి అడుగువేయి ఆచీ తూచి..
ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు
అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్క గట్టి
ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా.. మనుజా..
ఏమారితే నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా..
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ..
సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
Movie: Bluff Master (2018 - Telugu)
Music: Sunil Kashyap
Lyrics: Madhurakavi Koganti Venkataacharyulu, Ramajogayya Sastry
Singers: Sunil Kashyap, Anurag Kulkarni, Mohana Bhogaraju
Directed: Gopi Ganesh Pattabhi
Link: https://www.youtube.com/post/UgyttAcjU2AM1LZ5dlp4AaABCQ
Post a Comment