తప్పక తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! Untold Historical Facts Behind January 1st

 

ప్రతి భారతీయుడూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర!

జనవరి 1న ప్రపంచమంతా, కొత్త సంవత్సర వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ జనవరి ఒకటి కొత్త సంవత్సరానికి ఆరంభం అనే విషయం వెనుక, చరిత్రతో పాటు, ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయనే విషయం, మనలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం వాడుతున్న ఈ Calendar ని ఎవరు కనిపెట్టారు? పూర్వం ఏ నెలలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు? మన దేశంలో, ఈ ఆంగ్ల Calendar ఎలా అమలులోకి వచ్చింది? అత్యంత పురాతన సంస్కృతి గల మన దేశంలో, జనవరి 1 న కొత్త సంవత్సరాన్ని ఎప్పుటి నుండి జరుపుకుంటున్నారు? అనేటటువంటి విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/TNSy3HA-kus ]

జనవరి ఒకటి నుంచి, కొత్త సంవత్సరం ఆరంభం అవుతుందనీ, ఆ రోజుని New Year గా సంబరాలు జరుపుకోవడం వెనుక, చాలా పెద్ద చరిత్రే ఉందనీ చెప్పాలి. హిందూ, Babylonia, Zoroastrianism, Hebrew, Roman వంటి ప్రాచీన నాగరికతలకు చెందిన ప్రజలు, కొన్ని వేల ఏళ్ల క్రితం, వారి వారి క్యాలెండర్లను రూపొందించుకున్నారు. ఈ Calendars అన్నీ, సూర్యమానం, లేదా చంద్రమానం ఆధారంగా రూపొందినవే. అయితే, నేడు మనం ఉపయోగిస్తున్న ఆంగ్ల Calendar పుట్టుక, Roman calendar నుంచి వచ్చింది. సామాన్య శక పూర్వం, 7000 సంవత్సరాల ముందు వరకూ, రోమన్స్ తమ కొత్త సంవత్సరాన్ని మార్చి నెలలో జరుపుకునే వారు. అప్పట్లో వారి Roman calendar లో, కేవలం పది నెలలు మాత్రమే ఉండేవి.

ఈ calendar ని సంస్కరించాలనే ఉద్దేశ్యంతో, సామాన్య శక పూర్వం, 7వేల వ సంవత్సరంలో, ఆనాడు రోమ్ ను పాలించిన (న్యూమా పాంటీలియస్), జనవరి, ఫిబ్రవరి అనే రెండు నెలలను ప్రవేశపెట్టాడు. రోమన్లు ఎదైనా నూతన పని ప్రారంభించాలంటే, మొదటి పూజ, జానూస్ అనే దేవతకు చేసేవారు. ఆమె పేరు ఆధారంగా, జనవరి అనే నెలని రూపొందించడం వలన, ఆ నెలనే కొత్త సంవత్సరానికి ఆదిగా చెయ్యాలని నిర్ణయించాడు. అయితే, ఈ Calendar లో ఎన్నో తప్పులుండడం వలన, సామాన్య శక పూర్వం, 45వ సంవత్సరంలో, ఆనాటి రోమ్ చక్రవర్తి Julius Caesar, పాత రోమన్ Calendar ని సమూలంగా మార్చి, కొత్త కాలెండర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనినే Julius Calendar అని పిలిచేవారు. అంతేకాదు, ఇదే తొలి సౌరమాన Calendar గా, పేరుగాంచింది. అయితే, ఈ Calendar రూపకల్పన తరువాత కూడా, పాశ్చాత్య దేశాలు చాలా సంవత్సరాల పాటు, తమ కొత్త సంవత్సరాన్ని, మార్చి 25 న జరుపుకునేవి. కాలగమనంలో, అది ఏప్రిల్ కి మారింది. సామాన్యశకం మధ్యకాలంలో, డిసెంబర్ 25 ని క్రీస్తు జన్మదినంగా జరుపుకోవడం ఆరంభమవ్వడంతో, కొన్ని దేశాల వారు, క్రీస్తు పుట్టిన రోజునే, తమ కొత్త సంవత్సరంగా జరుపుకునే వారు. అయితే, ఈ భిన్న సంవత్సరాదులు పోయి, అందరూ ఒక రోజునే కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో, 1580 లలో, అప్పటి క్రైస్తవ మత గురువు Pope Gregory-13, Julius Calendar ని మరింత మెరుగుపరచడం మొదలుపెట్టి, 1582, అక్టోబర్ లో కొత్త Calendar ని ప్రవేశపెట్టాడు. దానినే, Gregorian calendar గా పిలుస్తున్నారు.

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నది, ఈ Gregorian calendar నే. ఈ calendar అమలులోకి వచ్చిన తరువాత, జనవరి 1 నే, నూతన సంవత్సరం ఆరంభంగా జరుపుకోవాలని, Pope Gregory గట్టిగా ప్రతిపాదించాడు. pope ప్రతిపాదనను అంగీకరించి, ముందుగా France, Italy, Portuguese, Spain దేశాల వారు అమలులోకి తెచ్చారు. ఆ తరువాత సామాన్యశకం, 1699 లో జర్మనీ, 1752 లో ఇంగ్లాడు, 1873 లో జపాన్, 1912 లో చైనా, 1916 లో బల్గెరియా, ఆఖరిగా 1918 లో రష్యా దేశాల వారు, ఈ Gregorian calendar ని అమలులోకి తెచ్చారు. ఇక బ్రిటీషు వారు, 17, 18 వ శతాబ్దాలలో, తమ ఆధీనంలో ఉన్నఅన్ని దేశాలలో, ఈ calendar ని అమలులొకి తీసుకురావడం జరిగింది. ఆ కాలంలో, మన భారతదేశం కూడా వారి పాలనలో ఉండడం వలన, ఈ ఆంగ్ల calendar అమలులోకి రావడం, వారి కొత్త సంవత్సరాన్ని మనం కూడా జరుపుకోవడం మొదలైంది. అయితే, ఈ Gregorian calendar లో, ఎన్నో తప్పులున్నట్లు, ‘మన దేశ’ పండితులే కాకుండా, పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. ఈ calendar లో ఉన్న తప్పులను సరిచేయడానికి, అప్పట్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ, ఈ Gregorian calendar ని క్షుణ్ణంగా పరిశీలించి, అందులో ఉన్న చాలా లోపాలను చూపిస్తూ, సామాన్య శకం 1926 లో, ఒక రిపోర్టు ఇచ్చింది. అయితే, ఆ నివేదికను, క్రైస్తవ సమాజం పూర్తిగా పక్కన పెట్టేసింది. అందువల్ల, ఈ calendar లో తప్పులున్నా, ప్రపంచీకరణ నేపద్యంలో, అన్ని దేశాల వారూ, జనవరి 1 ని,  సంవత్సరాది ప్రారంభంగా జరుపుకుంటున్నారు. 

అయితే, జనవరి 1 తో పాటు, ప్రపంచంలో అనేక దేశాల వారు, ఇప్పటికీ వారికి సాంప్రదాయంగా వస్తున్న నూతన సంవత్సర వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో కూడా, ఈ ఆంగ్ల సంవత్సరాదిని వేడుకగా జరుపుకున్నా, మన ప్రాచీన నాగరికతను విడువలేదు. అందువల్ల, పంటలు చేతికి వచ్చే సమయంలో కానీ, ఋతువులూ, పుణ్యదినాలను పురస్కరించుకుని కానీ, నూతన సంవత్సర పండుగను, చాలా వైభవోపేతంగా జరుపుకుంటున్నాం. ఈ విధంగా మన దేశంలో ప్రాంతాల వారీగా, 8 విధాలుగా, నూతన సంవత్సర పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలైనా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాతో పాటు, కర్ణాటక వారూ, చైత్ర మాసంలో వచ్చే శుక్ల పాడ్యమి నాడు, ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరాదిగా, తెలుగు సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు. ఇక తమిళనాడులో, ప్రతీ సంవత్సరం ఏప్రిల్ మధ్యలో, తమిళ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఆ పర్వదినాన్ని, వారు పుత్తండు లేదా వరుష అనే పేర్లతో పిలుచుకుంటారు. కేరళ వారు, తమ ప్రాచీన పంచాగాన్ని అనుసరించి, ప్రతీ సంవత్సరం medam అనే నెల మొదటి రోజున, నూతన సంవత్సర పర్వదినంగా జరుపుకుంటారు. ఆ పండుగనే, వారు విషు అని పిలుచుకుంటారు. కేరళ వారి శాస్త్రాల ఆధారంగా వచ్చే ఈ medam అనే నెల, ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యన ఆరంభమై, మే నెల మధ్యలో ముగుస్తుంది. 

గుజరాత్ వారు, ప్రతీ ఏడూ వచ్చే దీపావళి మరుసటి రోజుని, తమ నూతన సంవత్సర పర్వదినంగా జరుపుకుంటారు. దానినే వారు బెస్తు వారాస్ అని పిలుస్తారు. ఆ రోజున గుజరాత్ వారు, శ్రీ కృష్ణుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. పంజాబ్ వారు, బైసాఖి అనే పండుగను తమ కొత్త సంవత్సరాదిగా పేర్కొంటారు. సిక్కుల 10 వ మతగురువైన గురు గోబింద్ సింగ్ కలశ స్థాపన చేసిన రోజునే, బైసాఖిగా జరుపుకుంటారు. మహారాష్ట్ర వారైతే, గుడి పడ్వా అనే రోజుని, తమ నూతన సంవత్సరాదిగా జరుపుకుంటారు. ఈ పండుగను, అనాదిగా, వారి రాష్ట్రంలో మామిడి పంట చేతికి వచ్చిన రోజున, జరుపుకుంటారు. అస్సాం వారు, ఏప్రిల్ మధ్య నుంచి, వ్యవసాయం చేయడానికి అనువుగా, సంవత్సరాదిగా జరుపుకుంటారు. దానిని వారు రొంగాలి బిహు లేదా బొహగ్ అని పిలుస్తారు. ఇక బెంగాల్ వారికి ఏప్రిల్ మధ్యలో, తమ కొత్త సంవత్సరాది వస్తుంది. దానిని వారు pahela baisaakh అని పిలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని, బెంగాలీయులు చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే, మన భారతదేశమే కాకుండా, చాలా దేశాల వారు తమ నూతన సంవత్సరాదిని, జనవరి ఒకటిని కాకుండా, వేరు వేరు సమయాల్లో, చాలా ఘనంగా చేసుకుంటారు. జపాన్ వారు, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీల మధ్య, నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు. దానిని వారు యాబురీ అని అంటారు. అయితే, ప్రస్తుతానికి జపాన్ వారు, జనవరి 3 న, ఆ పండుగను జరుపుకుంటున్నారు. థాయ్ లాండ్, మయన్మార్ లలో, నూతన సంవత్సరాన్ని, ఏప్రిల్ 13 నుంచి 15 వరకు జరుపుకుంటారు. దీనిని వారు తిజాన్ అని పిలుస్తారు. ఇరాన్ ప్రజలు, సూర్యుడు మేషరాశిలో అడుగుపెట్టిన రోజుని, తమ కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు.

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes