'పుత్రద ఏకాదశి' - 24-01-2021..
హిందూ కాలమానంలో ఒకో ఏకాదశికీ ఒకో పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణమాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. ఈ పుత్రద ఏకాదశి మహాత్మ్యము భవిష్యోత్తర పురాణంలో, శ్రీకృష్ణ ధర్మరాజ సంవాదంగా వర్ణించబడింది..
ఎవరైతే సత్పుత్రుని కోరుకుంటారో, వారు ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని, భక్తి శ్రద్ధలతో చేయాలి..
విశ్వ దేవతలు ఈ విషయాన్ని సుకేతుమానుడనే రాజుకు చెప్పారు. ఆ రాజు ఆ విధంగానే పుత్రద ఏకాదశి వ్రతాన్ని నిర్వహించి, మర్నాడు పారణ చేశాడు. తత్ఫలితంగా, కొంతకాలానికే రాణి గర్భవతియై, పుణ్యవంతుడైన ఒక పుత్రునికి జన్మనిచ్చింది.
పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు, దశమినాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి. ఆ ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా. ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే, దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు. ఇక సంతానం ఒక లెక్కా!
సర్వేజనాః సుఖినోభవంతు!
[ ఏకాదశి అంటే ఏమిటి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/Lcy2ZkxYfYY ]
Link: https://www.youtube.com/post/UgxorN2QButi86eTX_h4AaABCQ
Post a Comment