విధి ఆడే వింత నాటకం! (ఒక చిన్న కథ)
మరణం యముడి చేతిలో కూడా లేదు! అవును.. ఒకనాడు శ్రీ మహావిష్ణువుని కలుసుకోవటానికి యమధర్మరాజు వైకుంఠం వెళ్లినప్పుడు, గుమ్మం దగ్గర గరుత్మంతుడు ఒక చిన్న పక్షితో కబుర్లు చెపుతూ ఉన్నాడు. లోపలకి వెళుతూ, యముడు పక్షి వైపు అదోలా చూశాడు. ఆ చూపుకి బెదరిన పక్షిని, గరుత్మంతుడు తన భుజాల మీద ఎక్కించుకున్నాడు.
[ విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/q7OQVyx4sU4 ]
మనసుకన్నా వేగంగా పయనించగలడని, పక్షిరాజుకి పేరున్నది. క్షణకాలంలో కొన్ని వేల, లక్షల యోజనాల దూరంలో, ఒక పర్వతాంతర్భాగపు గుహలో దాచి, ఎవరూ తొలగించలేని ఒక పెద్ద రాతిని అడ్డుగా పెట్టి, వెనక్కి వచ్చాడు. ఈ లోపు విష్ణుభగవానుడితో మాట్లాడడం పూర్తయిన యముడు బయటికి వచ్చి గరుత్మంతుణ్ణి చూసి, 'నీ ప్రక్కన ఆ పక్షి ఏది?' అని అడిగాడు.
'నీ గర్వం అణచటానికి, కొన్ని వేల యోజనాల దూరంలో, ఎవరికీ అందని చోట దాచాను' అన్నాడు గరుత్మంతుడు. 'అయ్యో! అలా చేశావా? నీ ప్రక్కనే ఉన్న పక్షి మరణం, మరికొన్ని క్షణాల్లో, ఎక్కడో కొన్ని వేల యోజనాల దూరంలో, పర్వత గుహలో, పెద్ద బండరాయి పడి సంభవిస్తుందని వ్రాసి ఉంటే, ఈ చిన్న పక్షి ఇంత దూరంనుండి క్షణాల్లో అంత దూరం ఎలా వెళ్తుంది? ఇదెలా సాధ్యం? అనుకుంటూ దాన్ని చూశాను. ఇది నువ్వు చేసిన పనా?' అన్నాడు యముడు.
విధి ఎంత బలీయమైనది? విధి లిఖితం జరగక మానదు! కానీ, నిత్య దైవ నామ స్మరణ తప్పక మేలు చేస్తుంది.. సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgznCweXtZCllAk5Tvh4AaABCQ
Post a Comment