సహనం! Patience


సహనం!

అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, తెల్లటి పూలతో, అందంగా ఉండేది.. 

దారిన పోయేవాళ్ళకు, ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది..

ఎంత వైరాగ్యం ఉన్నవాడికైనాసరే, నిండుగా ఉన్న ఆ చెట్టుని చూస్తే చాలు..

మళ్లీ జీవించాలనే ఆశ కలిగేది..

[ వేంకటేశుడి సన్నిధిలోని పవిత్ర తీర్థాలు! ఈ వీడియో చూడండి: https://youtu.be/NP3o-Ynr15w ]

అలా కొన్నాళ్ళు గడిచాక, చెడు గాలులు వీయడంతో, పూలన్నీ రాలిపోయాయి.. 

ఎండకు ఆకులు ఎండిపోయి, కొమ్మనుండి వేరైపోయాయి.. చెట్టు బోసిపోయింది.. 

అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు..

ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు..

అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు..

తనకు మళ్లీ గత వైభవం రాకపోతుందా! అనే నమ్మకంతో బ్రతుకుతోంది..

కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది.. అంతే, చెట్టులో చలనం మొదలైంది.. 

కొన్ని లక్షల చినుకులు కలిసి, ఆ చెట్టును తడిపేశాయి.. కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి, పువ్వులు వికసించాయి.. 

మళ్లీ పది మందికీ నీడనివ్వటం మొదలుపెట్టింది.. వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది ఆ చెట్టు!

మనిషి జీవితమూ అంతే..

ఒక్కోసారి కొన్ని అనర్ధాల వల్ల, నవ్వులనే పూలు మాయమౌతాయి..

కొన్ని అపార్ధాల వల్ల, కావలసిన వాళ్లే, ఎండిపోయిన ఆకులలా వీడిపోతారు..

అయినాసరే, నిరుత్సాహ పడకూడదు.. 

ఏదో వొక రోజు, ఆ అనర్ధాలూ, అపార్దాలనే అడ్డుతెరలు తొలగిపోతాయి..

ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో..

అదే నమ్మకంతో, ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుందని గట్టిగా నమ్ము..

అలా జరగాలంటే, నీకు కావలసిందల్లా, 'ఓర్పు, సహనం'..

'గొంగళి పురుగు' ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదన్న నిజం నువ్వు గ్రహించాలి..

కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..

ఎందుకంటే, మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు.. 

కాబట్టి, నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, సహనానికి ఆశ్రయం ఇవ్వు.. బద్ధకానికి కాదు..

నువ్వు త్వరగా లేచినంత మాత్రాన, సూర్యుడు ముందుగా ఉదయించడు.. 

దానికి సమయం రావాలి.. మనకు సహనం ఉండాలి..

సమస్యకి నువ్వెప్పుడూ తల వంచకు.. ఎవరో ఏదో అన్నారని, ఎప్పుడూ బాధ పడకు..

కాలం కలిసి రాలేదని నిందింస్తూ కూర్చోకు.. నష్టపోయా.. మోసపోయా.. అంటూ దిగులు పడకు..

అందరూ అవమానిస్తూ, హేళన చేస్తున్నారని కృంగిపోకు..

నిన్నటి వరకూ నీతో నడిచిన వాళ్ళు, ఈ రోజు లేరని ఆలోచించకు.. జీవితంలో ఎదగడానికి, ఇదొక అనుభవం అనుకో..

బాగున్నప్పుడు మా వాడే అని చప్పట్లు కొట్టే వారికంటే, నీ కష్టంలో నేనున్నానంటూ ధైర్యం చెప్పేవారే నీ వారు..

శిల ఉలి దెబ్బలు తింటేనే శిల్పంగా రూపు దిద్దుకునేది.. కొలిమిలో కాలితేనే, బంగారానికి మెరుగు వచ్చేది..

మట్టిలో పోరాడితేనే విత్తు మొలకెత్తేది.. చెట్టు ఆకు రాలిందని దిగులు చెందితే, కొత్త చిగురు తొడుగుద్దా?

'పువ్వు' ఒక రోజులో రాలిపోయేదానికి ఎందుకు అనుకుంటే, మరో పువ్వు పూస్తుందా?

ఇదో రంగుల ప్రపంచమని మర్చిపోకు.. ఇక్కడ నటించ గలరుగానీ జీవించలేరు..

కాబట్టి, విమర్శలను లెక్క చేయకు.. నువ్వో ప్రభంజనంగా మారే సమయాన, ఇవన్నీ మాములే మిత్రమా..

ఈ నాడు నీతో లేని వారు కూడా, నువ్వు ఎదిగిన నాడు, 'మావాడే' అంటూ నీ చుట్టూ చేరతారు చూడు..

ఆ రోజు మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకో..

నీ విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో, స్ఫూర్తితో వారు నిన్ను అనుసరిస్తారు..

నీ ఓటములను నీకన్నా పద్ద వారితో పంచుకో, మనకు అనుభవంతో వారు నీకు బోధిస్తారు.. 

ఈ ప్రపంచంలో ఏ సంపదా ఇవ్వనంత సంతోషం, మన అనుకున్న వాళ్ళ సాన్నిహిత్యంలో దొరకవచ్చు..

అందుకే, మీరు రోజూ కొంత సమయం వాళ్ళతో గడపడానికి కేటాయించండి..

నా వెనుక చాలా మంది ఉన్నారని గర్వపడకు.. మనల్ని వెన్నుపోటు పొడిచే వారు కూడా, వెనుక నుంచే వస్తారని మర్చిపోకు..

ఈ ప్రపంచంలో కొందరు ఎంత దగ్గరగా ఉన్నా, మనకు దగ్గర కాలేరు.. మరి కొందరు ఎంత దూరంలో ఉన్నా, మనసుకు దూరం కాలేరు.. మన మనస్సుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడ లేక పోవచ్చు.. మన మనస్సు మాత్రం వారి కోసం, ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది..

Manchimata Videos:

[ స్నేహ బంధం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/v5BseWhhnPM ]

[ అమృత హస్తం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]

[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]

[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]

[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]

[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]

[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]

[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]

[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes