ఋణానుబంధాలు! Runanubandham


ఋణానుబంధాలు!

శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికినా, శవం అనే అంటారు.. 'సమయం మించకుండా తీసేయండి' అని పెద్దలు అంటున్నారు.. భార్య గుమ్మం వరకూ, కొడుకు కాటి వరకూ వచ్చి, కర్మ చేసి వెళ్లిపోయారు.. అప్పుడు మొదలవుతుంది ఆత్మ ఘోష..

[ మరణం తర్వాత ఏం జరుగుతుంది? = ఈ వీడియో చూడండి: http://bit.ly/3pXKCFa ]

నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ, ఆ ఇంటికే వెళ్తాడు.. అతను ఎవరికీ కనిపించడు, వినిపించడు.. ఇది నా ఇల్లు, ఇవి నా వస్తువులు, ఇది నా ఆస్తి అని, నిన్నటి వరకూ కాపాడుకున్న ఏదీ నాతో తీసుకుని వెళ్ల లేక పోయానే?! వీటి కోసమా జీవితమంతా కష్టపడ్డాను?! అని ఏడుపు మొదలవుతుంది..

గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి, ఉన్నన్ని రోజులూ ఎదో ఒక సాకుతో సాధించాను.. కాస్త ఓపికగా, ప్రేమగా ఉంటే బాగుండేది.. ఇప్పుడు ఓదార్చే శక్తి కూడా లేదు.. అని అప్పుడనిపిస్తుంది. కుటుంబ సభ్యులను చూసుకుని, చేసిన పోరాబాట్లు గుర్తు చేసుకుని, ఒక్కసారి భగవంతుడు బతికిస్తే, అందరికీ క్షమాపణ చెప్పుకుని, మళ్ళీ నిదగ్గరకు వస్తాను తండ్రీ.. అని ఆత్మ ఘోషిస్తుంది.. 'చిన్న చిన్న తప్పులను క్షమించి, అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది' అనిపిస్తుంది..

ఎక్కడైతే వదిలేశారో, అదే స్మశానానికి తిరిగి వెళ్లి, అక్కడ ఒంటరిగా రోదిస్తూ.. 'భగవంతుడా!' అని పిలవగానే, ఓ స్వరం వినిపిస్తుంది.. నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను.. భయపడకు.. అని.. ఎవ్వరూ రాని చోటికి, ఏ దిక్కు లేని చోట కూడా, నీ కోసం శివుడు ఉన్నాడు..  అప్పుడు కనిపిస్తాడు దేవుడు..

అప్పటివరకూ ఆత్మఘోషతో రోదిస్తున్న ఆత్మ, ఏమైయ్యా బ్రతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను? ఎంత మొక్కి ఉంటాను? ఏనాడైనా ఇలా వెంటనే పలికావా? ఇప్పుడు మటుకు ప్రత్యక్షం ఐయ్యావు! అని అడుగుతుంది ఆత్మ.. శివయ్య అంటాడు 'నేను నువ్వు పిలిచిన ప్రతి సారీ పలుకుతూనే ఉన్నాను. కానీ నువ్వు వినలేక పోయావు. నువ్వు ఒకసారి పిలిస్తే, నేను 108 సార్లు పలుకుతాను. అది నీకు వినపడాలని. కానీ, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం, నేను, నాది, అనే మాయలోనే ఉన్నావు.. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే, నా మాట వినగలిగావు.. 

స్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను, ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను. నీ ప్రతి కష్టంలోనూ తొడుగానే ఉన్నాను. దాటిస్తూనే ఉన్నాను. కానీ, అదంతా నువ్వే చేస్తున్నాననుకున్నావు.. కనుకే నన్ను గుర్తించలేక పోయావు.. నువ్వు వచ్చే టప్పుడూ, నువ్వు పోయే టప్పుడూ, నీ తో వస్తున్నది నీ కర్మ మటుకే.. ఇంక ఏదీ నీతో రాదు.. అని శివయ్య చెప్పాక, ఏదీ శాశ్వతం కాదని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది.. రుణ బంధం ఉన్నంత వరకే ఈ జీవితం.. దేహం తట్టుకునే వరకే ప్రాణం.. తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే, ప్రాణం పోతుంది. ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది. ప్రాణమే అలా ఉన్నప్పుడు, ఇంక ఋణానుబంధాలు ఎలా ఉంటాయో ఆలోచించండి..

Link: https://www.youtube.com/post/Ugw022CKMiWllF8IpKZ4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes