ఆత్మజ్ఞానం!
ఉదయం ఆకాశం ఎరుపు రంగుకు వస్తె చాలు, ఇక సూర్యుడు వచ్చినట్లే. చెట్టుకు పూలు పూస్తే చాలు, ఇక ఫలాలు వచ్చినట్లే.
[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]
అలాగే, నీ అంతఃకరణంలో, దైవీ సంపద కూడుకుంటే చాలు, ఆత్మజ్ఞానం, తద్వారా పరమాత్మ నీలో ప్రవేశించినట్లే. కనుక, ఈ అధ్యాయంలోని విశేషాలను చక్కగా గ్రహించి, ఆసురీ సంపదను దూరంగా త్రోసివేసి, దైవీ సంపదను ఆహ్వానిద్దాం, వృద్ధి చేసుకుందాం.
వేదాంతంలో జీవుణ్ణి పక్షితో పోలుస్తారు. పక్షికి ముఖం సన్నగా ఉండి, రెండు కళ్ళూ ముఖానికి అటూ ఇటూ ఉండి, వేరు వేరు దృశ్యాలను చూపిస్తాయి. కానీ, మానవుడిలో ఆధ్యాత్మికమో, ప్రాపంచికమో, ఏదో ఒక్క దృష్టే ప్రబలంగా ఉంటుంది.
ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవాడు, ఇంద్రియాలనూ, మనస్సునూ స్వాధీనంలో ఉంచుకుని, తనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రాపంచిక దృష్టి ప్రబలంగా ఉన్నవాడు, ప్రపంచంలోనే కూరుకుపోతాడు. అతడు తనలోని వాసనలను గురించి, పట్టించుకోడు.
దాని కారణంగా, మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ.. మరణిస్తూ.. ఈ సంసార జనన మరణ చక్రంలో కూరుకుపోతాడు. ఆధ్యాత్మిక దృష్టి గలవాడు, తనలోని వాసనల గురించి విశ్లేషించి, అవి ఆసురీ సంపద అయితే, త్రోసివేసి, దైవీ సంపదను వృద్ధి చేసుకుంటాడు. పరమాత్మకు దగ్గరవుతాడు..
{ సప్తచక్రాలు = https://www.youtube.com/watch?v=Yow-obXvkJc&list=PLNoNQLGbZ7gbf0SATAiKQiEtlw4vmPv5I }
Link: https://www.youtube.com/post/UgydZFaGudcbiugFB2J4AaABCQ
Post a Comment