తెలియక చేసే ఈ పనులే దారిద్ర్యాన్ని తెచ్చిపెడతాయి - గరుడ పురాణం!
అన్ని దానాల్లోకెల్లా ఏ దానం గొప్పది అంటే, అన్నదానం, విద్యాదానం, రక్తదానం ఇలా చెప్పుకుంటూ పోతే, అన్ని దానాలూ గొప్పవే. మనకున్నదానిలో కొంత ఎదుటివారికి పంచడమనేది, గొప్ప లక్షణం.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/MRiexGfghUM ]
కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి ఆదుకోవడం, మనకు కలిగిన దానిలో కొంత, సాటివారి సంతోషం కోసం దానం చేయడం, పుణ్యకార్యాలు. ఇలా చేయడం వల్ల, ఇహపర లోకాల్లో శాంతీ, సంతోషాలూ లభిస్తాయనేది, పెద్దల ఉవాచ. అంతేకాదు, మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల, మనకున్న అదృష్టం కాస్తా దురదృష్టంగా మారి, మనలను వేధిస్తుంది. ఉన్నతమైన స్థానాలలో ఉంటూ, అకస్మాత్తుగా దరిద్రదేవతకు బలైనవారు, చాలా మంది ఉన్నారు. మనకు దురదృష్టాన్ని అంటగట్టే ఆ కార్యాలేంటి? ఏ వస్తువులను దానం చేయడంవలన దరిద్రం వెంటాడుతుంది? అనేటటువంటి ఆవశ్యక విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
సూదీ, కత్తెరా, కత్తులూ వంటి వస్తువులనూ, ఇనుప వస్తువులనూ దానం చేసినట్లయితే, ఇంట్లోని భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. వీటిని దానమిచ్చినవారు, ఏ కార్యం ప్రారంభించినా కలిసిరాదు. తెలియక అయినా, తెలిసైనా, చెడిపోయిన ఆహారాన్ని ఎట్టిపరిస్థితులలో దానం చేయకూడదు. భుజించడానికి పనికిరాని ఆహారాన్ని దానం చేసేవాళ్లకు, న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఏదో ఒక సమస్యలో ఇరుక్కుని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పాడైపోయిన భోజనాన్ని ఇతరులకు పెట్టేవారు, ఎంత సంపాదించినా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా, కటిక దరిద్రలుగా మిగిలిపోతారు. విరిగిన పాత్రలూ, పగిలిన కుర్చీలూ, చినిగిపోయిన దుస్తులనూ దానం చేయకూడదు.
ఒక అవసరం కోసం నిర్దేశించిన వస్తువు, ఆ పనికి అనర్హమైనప్పుడు, దానిని ఇతరులకు దానం చేయకూడదు. అటువంటి పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వలన, నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి, వీటిని దానం చేయడమంటే, చేజేతులారా లక్ష్మీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లే. చీపుర్లు దానం చేసినవారి ఇంట్లో, లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఈ వస్తువులను ‘దానం చేయకూడదు’ అనడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఇతరులకు ఇచ్చే ఏ వస్తువైనా, వారికి ఉపయుక్తమై ఉండాలి. అలా కాని పక్షంలో, మనం చేసే దానం, నిష్ప్రయోజనం. స్వతహాగా మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా, దరిద్రం వెంటాడుతుంది. ఒక వ్యక్తి డబ్బు సంపాదించినప్పుడు, గర్వపడకూడదు. ధనం వలన వచ్చే గర్వం, మూర్ఖత్వం.
ఎదుటివారిని చులకనగా చూపిస్తూ, వారిని అవమానపరిచేలా చేస్తుంది. వారికున్న సంపదను చూసి గర్వపడే వారు, లక్ష్మీ దేవి కోపానికి బలైపోతారు. ఒక వ్యక్తిని అవమానించడం, లేదా కించపరచడం, మహా పాపం. ఇతరులను కించపరిచే వ్యక్తులు, సంతోషాన్ని కొల్పోయి, నిరంతరం ముళ్లబాటలో పరుగెడుతుంటారు. మనలో చాలా మంది చేసే పని, విప్పిన, మాసిన దుస్తులను శుభ్రపరుచుకోకుండా, పదే పదే వాడడం. బట్టలు లేనివారికి దుస్తులు దానం చేయడం ఎంత పుణ్యప్రదమో, మనం విప్పిన బట్టలను, రోజుల తరబడి వేసుకోవడం, అంతే పాపం. శుభ్రత లేని వ్యక్తులను, లక్ష్మీ దేవి ఎన్నటికీ కటాక్షించదు.
కొంతమంది అభిప్రాయం ప్రకారం, రాత్రి పూట పెరుగు తినడం, దరిద్రానికి హేతువు. దీనిని మనం శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే, రాత్రి పడుకునే ముందు పెరుగు తినడం వలన, ఊబకాయం వస్తుంది. తద్వార గుండె సంబంధిత వ్యాధులూ, అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ, మన సంపదను ఆసుపత్రులకు అందించాల్సి వస్తుంది. అది కూడా, ఒక రకమైన దరిద్రమనే చెప్పవచ్చు. ఒక వ్యక్తి సంపదను దాచుకున్నా, లేకున్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మనకున్న దాంట్లో ఇతరులకు మనస్ఫూర్తిగా దానమివ్వడం వలన, లక్ష్మీ దేవి కృపకు పాత్రులమవుతాం.
సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgyzoSVGWn4nqBPGyGZ4AaABCQ
Post a Comment